Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్తులకు జియోట్యాగింగ్
- ఆన్లైన్లో టికెట్లు
- ఈసీఐఎల్ పర్యవేక్షణ
- పటిష్ట భద్రత
నవతెలంగాణ-యాదాద్రి
శ్రీ లక్ష్మీ నారసింహుడి నిజదర్శనం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తోన్న భక్తుల కల తీరనుంది. యాదాద్రి ఆలయ ప్రారంభ అద్భుత ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. ఈ నెల 21నుండి 27వరకు సప్తహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుపుకొని యాదాద్రి ఆలయం నేడు మహాకుంభ సంప్రోక్షణతో పునర్ ప్రారంభం కానుంది.యాదగిరిగుట్టను యాదాద్రిగా పునర్నామకరణం చేసిన చినజీయర్ ఈ బృహత్ కార్యానికి వచ్చే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. జీయర్ సహా ఎవరినీ ప్రత్యేకించి పిలవలేదని, అందరూ ఆహ్వానితులే అని యాదాద్రి ఆలయ అధికారులు చెబుతున్నారు. నేడు జరుగు మహాకుంభ సంప్రోక్షణకు సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జిల్లా, స్థానిక ప్రజాప్రతినిధులు హజరుకానున్నారు.
ఆన్లైన్ టికెట్...
సాధారణ భక్తుల విషయంలో ఆలయ అధికారులు పకడ్బందీ వ్యవస్థలను రూపొందించారు. కొండపైన టెక్నాలజీతో కూడిన సౌకర్యాలను భక్తులకోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అధికారులు. తిరుమల ఆలయం తరహాలోనే యాదాద్రి భక్తులకు కూడా ఆన్లైన్ ద్వారా టికెట్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి భక్తుడు క్యూఆర్ కోడ్‌తో దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ ఉన్నవారికే కొండపైకి అనుమతి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రికి వచ్చే భక్తులు కొండపైకి చేరుకోవడానికి ఆర్టీసీ ఈ నెల 25 నుంచి 75 బస్సులను ఏర్పాటు చేస్తోంది.
భక్తులకు జియోట్యాగింగ్...
కొండపైకి చేరిన భక్తులు నేరుగా దర్శన వరుసలోకి ప్రవేశిస్తారు. ఇక్కడే (ఈ ప్రవేశ ద్వారం) భక్తులకు జియోట్యాగింగ్ చేస్తారు. దర్శనం ముగించుకొని కొండ కిందకు వెళ్లే వరకు ప్రతి భక్తుడి పూర్తి సమాచారం ఉంటుంది. దీనివల్ల నిత్యం స్వామివారిని ఎంత మంది దర్శించు కున్నారో తెలుస్తుంది. మరో వైపు కొండపైన భక్తుల రద్దీ ఏర్పడితే కిందనే వారిని కొద్దిసేపు ఆపే వెసులుబాటు దీని ద్వారా లభిస్తు ందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు అందించే క్యూఆర్ కోడ్ టోకన్లు, ఇతర సాంకేతి కతను హైదరాబాద్ ఈసీఐఎల్ సంస్థ అందజేయ నునుంది. భద్రత కల్పనలోనూ ఈ సంస్థే కీలక ప్రాత పోషించనుంది. ఈ నెల 28న కొండ కింద గల కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణిలను ప్రారం బిస్తారు. ప్రత్యేక దర్శనాలు, ఆన్లైన్లో టిక్కెట్ల బుకింగ్ సౌకర్యం ఈ నెల 29 నుంచి అందు బాటులోకి రానుంది.
పటిష్ఠ భద్రత...
నూతన ఆలయం సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలో పార్లమెంట్ తరహాలో స్మార్ట్‌సిటీ టెక్నాలజీతో భద్రతా వ్యవస్థను నెలకొల్పనున్నారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఉంటుంది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన సాంకేతికత, కెమెరాలు, లైటింగ్, ఫెన్సింగ్, బాంబు డిటెక్టర్లు, బాంబు స్కానర్లు వినియోగిస్తున్నారు. పార్లమెంటులో భద్రతను పర్యవేక్షించే ఈసీఐఎల్ కంపెనీకి ఈ బాధ్యతలను అప్పగించడం గమనార్హం.