Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
వృద్ధాప్యం మరో పసితనంలాంటిదని..చిన్న పలకరింపును కోరుకునే వయస్సు వారిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.దురాజ్‌పల్లి వద్ద గల వివేకానంద వృద్ధాశ్రమంలో అమ్మవారి పండుగ లో పాల్గొన్న మంత్రి ఆశ్రమంలోని అవ్వలను ఆప్యాయంగా పలుకరించారు.కొద్దిసేపు వారితో ఏకాంతంగా ముచ్చటించిన ఆయన వారి కుటుంబ పరిస్థితులను, ఆరోగ్యస్థితిగతులను అడిగి తెలుసు కున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మీ యుల కోసం ఎంతగానో ఎదురుచూపులు చూసే మనస్సు వృద్ధాప్యంలోని వారిదని, అటువంటి వారు ఈ రోజుల్లో ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారన్నారు.ప్రేమ, ఆత్మీ యతల్లేని సంసారాల వల్ల, ఉద్యోగాల పేరిట దూరమై పోయిన కొడుకు కోడళ్ల వల్ల,గృహ సంబంధమైన వివాదాల వల్ల దూరంగా ఉంటున్నారన్నారు కారణమేదైనా ఫలితం మాత్రం పండుటాకులైన తల్లిదండ్రుల మీద పడు తోందన్నారు.అమ్మా అన్న పిలుపుకోసం 'నాన్నా' అన్న పలకరింపు కోసం గుండెల్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని గద్గతస్వరంతో అన్నారు. ఇటువంటి వారిపై సమాజంలోని ప్రతిఒక్కరూ ఆలోచిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వా హకులు సవరాల సత్యనారాయణ, బొమ్మిడి లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మెన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా పరిషత్ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకట నారాయణగౌడ్, రాష్ట కార్యదర్శి వైవీ, చివ్వెంల వైస్‌ఎంపీపీ జీవన్ రెడ్డి, పట్టణ ప్రధానకార్యదర్శి బాలసైదులు, పెద్దగట్టు చైర్మెన్ కోడి సైదులు యాదవ్, కౌన్సిలర్లు జహీర్, గండూరి కృపాకర్ పాల్గొన్నారు.