Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
దివంగత గుండగొని మైసయ్య గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకణాలు శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీ నివాస్ గౌడ్ అన్నారు. మైసయ్య గౌడ్ 23వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని అయన విగ్రహనికి బీజేపీ కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ చేనేత కార్మికుల సమస్యలపై చండూర్ మండలం తెరెటుపల్లి గ్రామంలో జన సమీకరణకు వెళ్లిన సందర్భంగా నక్సలైట్లు హత్య చేశారని అన్నారు. మైసయ్యగౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ సంద్భంగా పేదలకు భోజన ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ ఇంచార్జీ గుండగొని భరత్ గౌడ్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, పల్లె బోయిన శ్యామ్ సుందర్, సీనియర్ నాయకులు వీరెల్లి చంద్రశేకర్, గుండగొని గిరిబాబు, గుండగోని శ్రీనివాస్ గౌడ్, నన్నూరి రామ్ రెడ్డి, కంకణాల నివేదిత రెడ్డి, కన్మమంత శ్రీదేవి రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసొజు యాదగిరా చారి, జిల్లా ప్రథాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.