Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు
- అధిక ధరలకు అమ్మకాలు
- చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు
నవతెలంగాణ-మర్రిగూడ
గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలి శాయి. ప్రతి కిరాణం షాపులో మందు లభిస్తుంది. వైన్స్ యాజమాన్యానికి ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మర్రిగూడ మండలంలో గతంలో రెండు వైన్స్‌లు ఉండగా ప్రస్తుత సంవత్సరం మరొక వైన్స్ ఏర్పాటు చేయగా మొత్తం 3 నిర్వహించారు. వైన్స్‌లు రోడ్డు సమీపాన ఉన్నాయని అనేకమార్లు పలు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించగా మూడుషాపులను ఒకే ప్రాంతంలో బస్టాండ్ సమీపాన ఏర్పాటు చేశారు. ఆ కాలనీ వాసులు మాత్రం నిత్యం రద్దీగా ఉంటుందని వచ్చి పోయే వాహనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. మండల కేంద్రంలో కేవలం మూడు వైన్స్ లే నిర్వహిస్తున్నారు, కానీ 20 గ్రామ పంచాయతీలు ఇరవై ఆవాస ప్రాంతాల్లో దాదాపు 300కు పైగా బెల్టుషాపులు నిర్వహణ కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో. మూడు వూన్స్లో ఒకదానిని పూర్తిగా బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నారు.10 నుంచి 20 రూపాయలు అదనంగా అంటగడుతున్నారు. వారు తిరిగి ఎంఆర్పి కంటే 30 నుంచి 40 అధికంగా విక్రయిస్తున్నారు. ఈ షాపుల్లో కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. మరోపక్క వైన్స్ షాపులను మండల కేంద్రానికి దూరంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
మా దృష్టికి రాలేదు
- మాధవయ్య, నాంపల్లి ఎక్సైజ్ సీఐ
గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణకు ఎలాంటి అనుమతులు ఉండవు. మర్రిగూడలోని మూడు వైన్స్ లు సిండికేట్ గా నిర్వహిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు.