Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
జిల్లాలోని అన్ని చెరువులను మత్స్యకార్మిక సంఘాలకు కేటాయించాలని మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడలగణేష్ డిమాండ్ చేశారు.జిల్లాకేంద్రంలోని వర్తక సంఘంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.57 ఏండ్లు నిండిన మత్స్యశాఖ కార్మికులకు నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు.రిజిస్టర్ చెరువులు, కుంటలను స్థానికులకు సొసైటీలు చేయాలని కోరారు.మత్స్య శాఖ కార్మికులకు బ్యాంకు ద్వారా వడ్డీలేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పేద మత్స్యశాఖ కార్మికుల గ్రామాల్లో ఇండ్లస్థలాలు, డబుల్ బెడ్ రూములు నిర్మించాలని కోరారు.జిల్లాకేంద్రంలో చేపలు మార్కెట్ ఏర్పాటు చేయాలని, ఏమైనా ప్రమాదం జరిగితే రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లాకార్యదర్శి గోదా శ్రీరాములు, ఏషాలఅశోక్ , చెక్క వెంకటేష్ , రైతుసంఘం నాయకులు కొల్లూరు రాజయ్య పాల్గొన్నారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక
మత్స్యశాఖ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవఅధ్యక్షులుగా చెక్క వెంకటేష్,అధ్యక్షులుగా అన్నమైన వెంకటేశం, ప్రధానకార్యదర్శిగా తమల తిరుపతయ్య, సహాయ కార్యదర్శిగా పెద్దబోయిన మల్లేష్, కార్యవర్గ సభ్యులుగా ఈగల లింగం, పరుశరాములు ఎన్నికయ్యారు.