Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
గొర్రెల పంపిణీతో ఆర్థిక చేయూత లభిస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రా మానికి చెందిన యాదవులు వై.కష్ణయ్య, నాగరాజు, కె.అం జయ్య, డి. ఆంజనేయులు, వై.సైదులుకు 120 గొర్రెలు, ఆరు పొట్టేళ్లను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, యాదవులు ఆర్థికం గా నిలదొక్కుకోవడానికి ఎంతో ఉపయోగక రంగా ఉందన్నారు. మాంసానికి కూడా మంచి డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట రెడ్డి, కీతవారిగూడెం సర్పంచ్ కీత జ్యోతి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథరెడ్డి, కౌన్సిలర్లు జక్కుల సాంబయ్య, గురవయ్య, సురేష్ బాబు, అనంత శ్రీనివాస్, వీరారెడ్డి, అబ్దుల్ నబీ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస రావు, హుజూర్నగర్ వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
రీసైకిల్ యూనిట్ ప్రారంభం
హుజూర్నగర్ పట్టణంలోని కోదాడ రోడ్డు నందుగల దద్దనాల చెరువు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీిఆర్ ఇండిస్టీ రీసైకిల్ యూనిట్‌ను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదివారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కొంత ఉపయోగం ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, రవి, మాజీ మున్సిపల్ చైర్మన్ దంత గాని శ్రీనివాస్ గౌడ్, కడియాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.