Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్గొండ
పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాల యం సమీపంలో లైట్ మోటర్స్ ఓనర్స్, డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఆది వారం నిర్వహించిన ఉప్పలమ్మ తల్లి పండుగలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చేదాకా ఉప్పలమ్మ తల్లి దీవెనలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య , ఎంపీపీ మని మధె సుమన్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్‌రెడ్డి, యూనియన్ అధ్యక్షులు గంజి యాదగిరి, ఉపాధ్యక్షుడు దాసరి శంకర్, ప్రధాన కార్యదర్శి జాన్ పాల్, కోశాధికారి రాజశేఖర్, ఆర్గనైజర్ జహంగీర్, దువా యాకయ్య,శివప్రసాద్ పాల్గొన్నారు.