Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నేడు, రేపు నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సమ్మెకు, గ్రామీణ హర్తాళ్‌కు ఐద్వా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, సమ్మెను విజయవంతం చేయాలని ఆ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోలేబోయిన వరలక్ష్మి, పాలడుగు ప్రభావతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 8,72, 243 ఉద్యోగాలను భర్తీ చెయ్యాలని, దేశంలో మహి ళల పైన జరుగుతున్న వరుస దాడులు, గృహ, మత హింసకు వ్యతిరేకంగా గ్రామాల్లో బంద్ పాటిం చాలని కోరారు. కార్మికుల కనీస వేతనం నెలకు రూ.26,000 చెల్లించాలని, ధరల పెరుగు దలకనుగుణంగా అన్ని తరగతుల కార్మికులకు వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న వారందరినీ కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, డైలీవేజ్, కంటింజెంట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
నాంపల్లి : మార్చి 28, 29న సార్వత్రిక దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని నాంపల్లి మం డల కేంద్రంలో అంగడి బజార్ ఆటో డ్రైవర్ యూ నియన్ సభ్యులకు సీఐటీయూ ఆధ్వర్యంలో కరప త్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ 8 గంటలుగా ఉన్న కార్మికుల పని గంటలకు 12 గంటలకు పెం చుతూ కేంద్రం లేబర్ కోడ్ లను తెచ్చిందని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నిర్వహి స్తున్న సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొ నాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మండల అధ్యక్షుడు నాంపల్లి శంకర్, హత్యిరామ్, కోట్యనాయక్, రమేష్, వెంకటయ్య, సైదులు, తదితరులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి : బీజేపీ ప్రభుత్వం అను సరిస్తున్న కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 28,29 తేదీలలో నిర్వహించే సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు హాజరు కావాలని కోరుతూ విశాఖ, హమాలి రంగ కార్మిలతో కలిసి నాయకుడు రొండి శ్రీనివాస్ వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని కొంతమంది కార్మికులను సమ్మెలోకి రాకుండా బెదిరింపులు చేస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. కార్యక్రమంలో విశాఖ యూనియన్ అధ్యక్షుడు ఆంజనేయులు, సోవన్న, జానీ, హమాలి అధ్యక్షుడు యాదయ్య, కార్యదర్శి పుల్లెమాల్ రాజు, వెంకన్న పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌టౌన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమ్మె గంటలు మోగించేందుకు కార్మికులు, ఉద్యోగులు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ కోరారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో మార్చి 28 ,29 లలో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ప్రధాన రహదారిపై ప్రదర్శన, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను హరించే బీజేపీ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈనెల 28న ఐక్య కార్మిక సంఘాలు ఐఎన్టియుసి, ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్ టియు, టిఎన్‌యుసి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో మిర్యాలగూడ రోడ్డు మున్సిపల్ కార్యాలయం నుండి ప్రదర్శన ప్రారంభమై పొట్టి శ్రీరాములు సెంటర్ నందు సభ జరుగుతుందని తెలిపారు. 29న చలో సూర్యాపేటకు పెద్ద ఎత్తున కార్మికులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు ఉప్పతల వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా, పర్వతాలు, మెరిగ దుర్గారావు, పల్లపు రామకష్ణ, షేక్ బాబులు, దారా శ్యామ్, ఏసుబాబు, పెరుతోడి శ్రీనివాస్, పహాల్ రాజు, పహాల్ రాకేష్, నకిరేకంటి అంజయ్య, నందిపాటి సైదులు, వీర నాగేశ్వరరావు, నాగరాజు, సతీష్, రామకష్ణ, వీరబాబు నాగుల్ మీరా, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : ఈనెల 28, 29 తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, జిల్లా నాయకులు భవాండ్లపాండు ఆదివారం సంయుక్త ప్రకటనలో కోరారు. మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలు ఈ సమ్మెకు సహకరించాలని కోరారు. ఉదయం 10 గంటలకు స్థానిక సుందరయ్య పార్క్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు.