Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్కట్పల్లి : నార్కట్పల్లి మండలంలోని చిన్న తుమ్మలగూడెం శివారులో ఉన్న వినాయక మెటల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆదివారం భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కంపెనీ వల్ల మూడు గ్రామాల్లో ఉండే రైతుల భూములు కలుషితమై అనేక రకాల జీవజాతులకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ కంపెనీ రద్దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో వార్డు సభ్యులు కొల్లు బిక్షం రెడ్డి, వర్రే సత్యనారాయణ, పడమటి శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డి, ధర్మారెడ్డి, కొంతం యశోద, గునురెడ్డి అలివేలు, వెంకట్ రెడ్డి , వేముల సైదులు పాల్గొన్నారు.