Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాకార్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు
- రాజధాని నుండి యాదాద్రికి స్వాగతతోరణాలు
- మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి
- నేటి నుంచి మూలవరులదర్శనం
నవతెలంగాణ-యాదాద్రి
పంచరూపాల్లో శ్రీ లక్ష్మీనారసింహుడు యాదగిరిగుట్టపై భక్తులకు పునర్దర్శనమిచ్చే సమయం నేడు. ఏడేండ్ల తర్వాత ప్రధానాలయంలో మూలవరుల నిజరూప దర్శనం ఆవిష్కృతం కానుంది. నేడు మహాకుంభ సంప్రోక్షణ కార్యం ముగిసిన తక్షణమే శ్రీ లకీë సమేత నసింహుడి దర్శనం భక్తులకు కలగనుంది. ఈ వైభవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేంద్రశేఖర్రావు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనున్నారు. యాదాద్రి వైభవాన్ని నలుదిక్కుల చాటేలా తెలంగాణ రాజధాని నుండి యాదగిరిగుట్ట పట్టణం వరకు స్వాగత తోరణాలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొండ చుట్టు ఉన్న వలయ రహదారిలోనికి ఎవరు రాకుండా ఉండేందుకు 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. కాగా సంప్రోక్షణకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ముగిశాయి. ఈ మేరకు శనివారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునితతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.