Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
తెలంగాణలో అత్యంత అద్భుత కోటలలో ఒకటి దేవరకొండ కోట అని, దీనికి ప్రపంచ ఖ్యాతి ఉందని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో ఏప్రిల్ 18వ తేదీ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా దేవరకొండ ఖిల్లా హెరిటేజ్ రాక్స్, ఖిల్లా కట్టడాలకు సంబంధించిన ఫొటో పోస్టర్లను దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ కోట ప్రపంచవ్యాప్తంగా అనేక పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. ఈ కోటను 13- 14వ శతాబ్ధాల కాలంలో నిర్మాణం చేసినట్లు తెలిపారు. దేవరకొండ కోట పద్మ నాయక వెలమ రాజుల కాలంలో నిర్మించినట్లు చెప్పారు. ఖిల్లాను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్, జెడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వాడిత్య దేవేందర్, కౌన్సిలర్లు మూడావత్ జయప్రకాష్ నారాయణ, మహమ్మద్ రైస్, పొన్నబోయిన సైదులు, గొసుల అనంతగిరి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.