Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్
నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని దానికి ఇలాంటి టాలెంట్ టెస్ట్లు దోహద పడతాయని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పదోతరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ మోడల్ పరీక్ష స్థానిక బకాల్వాడి పాఠశాలలో నిర్వహించారు. ప్రశ్న పత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోతరగతి వార్షిక ఫలితాలు రాసే విద్యార్థులకు ఈ టాలెంట్ పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టవచ్చుని, ప్రశ్నావళి ఏవిధంగా వస్తుందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. దీనివల్ల వార్షిక పరీక్షల్లో ప్రశ్నలకు సులభంగా సమాధానాలు రాసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని అన్నారు. అధ్యాయనం పోరాటం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ పనిచేస్తుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ఎస్ఎఫ్ఐ లక్ష్యమన్నారు. విద్యార్థులు ఇలాంటి మోడల్ పరీక్షలను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, జిల్లా నాయకులు ఆయూబ్, సీఐటీయూ నాయకులు లక్మి నారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా నాయక్, ఎస్ఎఫ్ఐ టౌన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్ నాయక్, వదూద్, ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ మండల అధ్యక్షుడు ముని నాయక్ సమద్, గని ముని అరిఫ్ తదితరులు పాల్గొన్నారు.