Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఆరోపించారు. తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న పవర్లూమ్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ,గ్యాస్ ధరలు తద్వారా ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిరోజు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుందని తద్వారా ప్రతి వస్తువు రేటు పెరిగిపోయి ప్రజలకు భారంగా తయారయ్యాయని పేర్కొన్నారు. ప్రాణాధార ఔషధాల రేట్లు కూడా ఎనిమిది వందల రకాల మీద ఫార్మా కంపెనీలు రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యం మీద దెబ్బతీస్తున్నాయని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఇది తగదని ప్రజా పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమస్యల మీదనే దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందని, రాబోయే రోజుల్లో ప్రభుత్వం దిగిరాకపోతే ఈ మధ్యనే జరిగిన రైతు పోరాట స్ఫూర్తితో ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు ప్రజలు చేస్తారని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కరెంటు చార్జీలు, బస్ చార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచన చేసి పెంచిన ఛార్జీలను తగ్గించాలని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెండెం రాములు, కర్నాటి శ్రీరంగం, దేవులపల్లి గిరిబాబు, పెండెం బుచ్చిరాములు, కటకం రమేశ్, తదితరులు పాల్గొన్నారు.