Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోదాడరూరల్ : మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో సర్పంచ్, టీిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించి చీరె సారెతో సత్కరించారు. చర్చిలో ప్రార్ధనలు చేసి కేక్ కటింగ్ చేపించి పాస్టర్లు దీవించారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవితక్క యువసైన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి మాట్లాడుతూ సేవాకార్యక్రమాలు నిర్వహించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పాముల మస్తాన్, అన్నెం వెంకట్ రెడ్డి, కలకొండ బాల కృష్ణ, కంచుకంటి గోపి, అంబడిపూడి రవికుమార్, షేక్ ఉద్దండు, హస్సన్ అలీ, గీత, సాయిబాబు, సతీష్, లక్ష్మణరావు, నాంచారయ్య, లింగరావు, శ్రీను, ప్రవీణ్, మట్టయ్య, భాస్కర్, ప్రభాకర్, విజరు రావు, పాల్గొన్నారు.