Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతికి పాల్పడుతున్న మత్సశాఖ అధికారి
- రూ.11.50 లక్షలు కాంట్రాక్టర్‌కు బదలాయింపు
- అనర్హులకు ఓటరుజాబితాలో పేరు నమోదు..
- అధికారులకు తెలిసినా చర్యలు నిల్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
మత్స్యశాఖలో పనిచేస్తున్న డివిజన్ అధికారి ఓ పెద్ద రిజర్వాయర్ కలిగిన మత్స్య సహకార సంఘానికి పర్సన్ ఇన్చార్జి వ్యవహరిస్తున్నారు.పాలకవర్గం లేకపోవడంతో ప్రభుత్వం ఆయన్న ఇన్చార్జిగా నియమించింది.ఇదే అదునుగా భావించిన ఆ అధికారి కార్మికులకు సంబందంలేకుండానే చెరువుపై వచ్చిన ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా మొక్కెస్తున్నాడు.. ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై వచ్చిన ఆదాయాన్ని ఆయనకు నిబంధనలకు విరుద్దంగా ముట్టజెప్పడం, అంతేగాకుండా వృత్తికి సంబంధంలేని వ్యక్తులకు సహకార సంఘంలో సభ్యత్వం కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా జిలా, రాష్ట్ర స్థాయి అధికారులకు తెలిసినా అతనిపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజవేస్తున్నారు.
సంఘం సొమ్ము కాంట్రాక్టర్‌కు...?
జిల్లాలో పెద్ద రిజర్వాయర్లలో అక్కంపల్లి రిజార్వాయర్ ఒకటి.దీనికి మత్స్యసహకార సంఘం పాలకవర్గం గడువు 2020 నవంబర్ 10న ముగిసింది. ఈ సంఘంలో 614 మంది సభ్యులు ఉన్నారు. అందులో సుమారు 100మంది వరకు మరణించారు.ప్రస్తుతం 514మంది సభ్వత్వం కలిగి ఉన్నారు.అయితే పాలకవర్గం గడువు తీరిన నాటి నుంచి పర్సన్ ఇన్చార్జిగా మత్స్యశాఖ డివిజన్ అధికారి వ్యవహరిస్తున్నారు.రెండేండ్లుగా రిజర్వాయర్‌లో ప్రభుత్వం ఉచితంగా చేపలు పంపిణి చేసింది.అందులో రొయ్యలు సుమారు 9లక్షలు, చేపలు 25లక్షల పిల్లలను రిజర్వాయర్‌లో వదిలారు.డివిజన్ అధికారి ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై అక్రమంగా వాటిని పట్టి అమ్ముకున్నారు.ఇదిఅధికారుల విచారణలో కూడా నిరూపించబడింది. ఆ చేపలు విక్రయిస్తే రూ.11.50లక్షలు వచ్చిందని డివిజన్ అధికారి రాష్ట్ర స్థాయి అధికారి ముందే ఒప్పుకున్నారు.వచ్చిన సొమ్మును ఏం చేశారని ప్రశ్నిస్తే చేపల కాంట్రాక్టర్‌కు ఇచ్చానని ఒప్పుకున్నారు.తానే స్వయంగా లిఖిత పూర్వకంగా రాసివ్వడం గమనార్హం. కానీ కాంట్రాక్టర్‌కు ఇచ్చినట్లుగా ఏదైనా ఆధారం ఉందా అంటే అదీ కూడా లేదని చెపుతున్నాడు. ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారో...కార్మికులతో సమావేశం నిర్వహించి చేశారా అంటే దానికి ఆయన స్పందన మరో విధంగా ఉంది. కానీ వాస్తవంగా చేపలు విక్రయిస్తే వచ్చిన డబ్బులు దాదాపు రూ.50లక్షలకు పైగా ఉంటాయని మత్ససహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.అయితే రెండు రోజుల కింద మత్స్యశాఖ జిల్లా కార్యలయంలో రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారి ముందే సొసైటీ సభ్యులు సమక్షంలో దాదాపు 30లక్షలకు పైగా చేపలు విక్రయిస్తే రూ.11.50లక్షల ఆదాయం ఏలా వస్తుందని కూడా డివిజన్ అధికారిని ప్రశ్నిస్తే సమాధానం లేదు.
ఓటరు జాబితాలో ఆయనకు నచ్చితే సరీ..
అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద భూములు కొల్పోయిన వారు దాదాపు ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు ఉన్నారు.భూములు తీసుకునే సమయంలో ప్రభుత్వ పథకాలతో పాటుగా సహకార సంఘంలో అందరికి సభ్యత్వం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే వాళ్లంతా దరఖాస్తు చేసుకుని సుమారు 3వేల మంది సభ్వత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కానీ మత్స్యశాఖ డివిజన్ అధికారి మాత్రం ఎప్పుడో పదేండ్ల కింద చనిపోయిన సభ్యుడి కుమారుడికి వారసత్వం కింద సభ్వత్వం కల్పించారు.ఇతర దేశంలో ఉద్యోగం చేస్తున్న మరో వ్యక్తికి సభ్వత్వం కల్పించారు. వీళ్లకు వృత్తిపై ఎలాంటి అవగాహన లేదు.ఇలాంటి తప్పుడు పేర్లు సుమారు 100 వరకు ఉంటాయని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.అంతేగాకుండా ఓటరు జాబితాను విడుదల చేసే ముందు కనీసం జిల్లా అధికారులకు, సొసైటీ సభ్యులకు కూడా సమాచారం లేకుండానే ప్రకటించినట్టు సమాచారం.గతంలో కూడా ఈ అధికారిపై అనేక ఆరోపణలు వచ్చాయి.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేత సమయంలో,ఇన్సురెన్సూ దరఖాస్తుకు కూడా డబ్బులు తీసుకున్నారన్న విమర్శలు లేకపోలేదు.అయినా మత్స్యశాఖ అధికారులు అవినీతికి పాల్పడుతున్న ఈ అధికారిపై చర్యలు తీసుకోకపోవడంతో సొసైటీ సభ్యులకు అనేక అనుమానాలు వస్తున్నాయి.
అధికారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి
సదానందం, మత్స్యసహకార సంఘం మాజీ అధ్యక్షులు
మత్స్యశాఖ డివిజన్ అధికారి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సొసైటీ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడు.ఇప్పటికే రాష్ట్ర, జిల్లా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందిం చడం లేదు. ఇప్పటికైనా ఆయన అవినీతిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసు కోవాలి.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
ఎం.వెంకయ్య, మత్స్యశాఖ జిల్లా అధికారి నల్లగొండ
సొసైటీలో జరుగుతున్న పలు అంశాలపై తన దృష్టికి కూడా సభ్యులు తీసుకొచ్చారు. వాటన్ని ంటిని ఉన్నతాదికారులకు తెలియజేస్తా. తదు పరి వచ్చిన ఆదేశాలను బట్టి నడుచుకుంటాం.