Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం నకరేకల్ పట్టణ శివారులోని నిమ్మ మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన పీఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి ధాన్యం కొనుగోలు బాధ్యతను తీసుకొని ఐకెపి కేంద్రాలను ప్రారంభించారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు చేయాలని వివిధ పద్ధ్దతుల్లో తెలంగాణ ప్రభుత్వం నిరసనలు వ్యక్తం చేశామని, చివరకు ఢిల్లీలో దీక్షలు చేసినా చలనం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, కట్టంగూర్ జెడ్పీటీసీ తరాల బలరాం, పీఏసీఎస్ సీఈవో జగన్ మోహన్ రెడ్డి, నాయకులు పగడపు నవీన్ రావు, మురారి శెట్టి కృష్ణమూర్తి, పల్లె విజరు, సిలువేరు ప్రభాకర్ పాల్గొన్నారు.