Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూర్
భూసారాన్ని పెంపొం దించుకుం టేనే అధిక దిగుబడి వస్తుందని జిల్లా సహాయ వ్యవసాయ అధికారి యల్లయ్య అన్నారు. మంగ ళవా రం మండలం లోని కస్తాల రైతు వేది కలో గ్లోబల్ అగ్రి ఇన్నో వేటివ్ రీసెర్చ్ ఫార్మ్ వారు నిర్వహించిన రైతు అవగా హన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫార్మ్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమని, రైతులు సాగు చేసే క్రమంలో సరైన మెళకువలు పాటించి అధిక దిగుబడులు పొందాలన్నారు. ఎంపీపీ పల్లె కళ్యాణి రవి కుమార్ మాట్లాడుతూ దుక్కులతో సూక్ష్మ క్రిములు పోయి భూమి గుల్ల బారుతుందని, వర్షపు నీళ్లు భూమి అంతర్భాగంలోకి వెళ్లి భూమి తేమ కలిగి వర్షాకాలంలో వేసుకునే పంటలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫార్మ్ అధ్యక్షులు నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్ , ఏవో మల్లేశం, రైతులు మందడి నర్సిరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకన్న, ఎంపీటీసీ పల్లె వెంకన్న, మెండు వెంకటరెడ్డి, గుండమళ్ళ శ్రీనివాస్, ఏఈఓలు, గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫార్మ్ ప్రధాన కార్యదర్శి పగడాల నాగయ్య, గౌరవ సభ్యులు దేవరకొండ వెంకన్న, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.