Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలయ్య
కట్టంగూర్ : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజుల పనిదినాలు రోజుకు కనీసం వేతనం 600 రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉపాధి కూలీలతో నిరసన తెలిపి ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధిహామీలో గత కొన్ని వారాల నుండి పని చేస్తున్న కూలీలకు డబ్బులు రాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీస అవసరాలు కూడా తీరక పోవడంతో కూలీలకు పూట గడవడం కష్టం అవుతుందన్నారు. ఈ విషయంపైన ఎన్ని ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి గుడుగుంట్ల రామక్రిష్ణ, అధ్యక్షులు ధరణి బోయిన సైదమ్మ, గోలి స్వామి, ముస్కు రవీందర్,గంటెపాక ధనమ్మ, కమ్మంపాటి బిక్ష్మయ్య,కత్తుల మహాలక్ష్మి, పావని, శశికల, సరోజ, రేణుక,బండారుశోభ,పద్మ, ఈశ్వరమ్మా,రమణ,పాపయ్యలు పాల్గొన్నారు.