Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరురూరల్: రోడ్డు పైన దొరికిన విలువైన బంగారు ఆభరణాలను పోగొట్టుకున్న వ్యక్తికి నిజాయితీగా అప్పగించిన సంఘటన మంగళవారం కొలనుపాకలో జరిగింది.. వివరాల్లోకెళితే.. గుండ్లగూడెంకు చెందిన భీమగాని కిషన్ గౌడ్ సోమవారం తన ద్విచక్ర వాహనం పై బచ్చన్నపేటకు వెళ్లాడు. మార్గమధ్యంలో కొలనుపాకలో ఆగి రోడ్డు పక్కన ఒక పండ్ల బండివద్ద పండ్లు కొనుగోలు చేసి పర్సులోనించి డబ్బులు తీసి ఇచ్చి వెళ్లిపోయాడు.బచ్చన్నపేటలోని కూతురు ఇంటికి చేరాక చూసుకోగా జేబులో ఉన్న నాలుగున్నర తులాల ఆభరణాలు పడిపోయినట్టు గుర్తించి అక్కడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా కొలనుపాకలో పండ్లు కొన్న సమయంలో నగలు పడిపోగా ఇదే గ్రామానికి చెందిన రిటర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఆనంతుల సోమిరెడ్డి, సంగరి బాలకిషన్ కు దొరికాయి.. విషయం తెలియడంతో మంగళవారం బాధితుడు కిషన్‌ను పిలిపించి సర్పంచి ఆరుట్ల లక్ష్మిప్రసాద్ రెడ్డి, గ్రామ పెద్దల సమక్షంలో రూ.2.5 లక్షల విలువైన నగలను అప్పగించారు. సోమిరెడ్డి, బాలకిషన్ లను గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాజయ్య అంజయ్య తదితరులు పాల్గొన్నారు.