Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
కేసీఆర్ ప్రభుత్వానికి రైతాంగం ఉసురు తప్పదని, ప్రభుత్వం దిగి పోయే లోపు రైతులపై వేధింపులు మానుకోవాలని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.మంగళవారం హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్తూ సూర్యాపేటలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్రావు నివాసంలో ఆగి మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం దిగిపోయేలోపు రైతులపై వేధింపులు మానుకోవాలని హెచ్చరించారు.త్వరలో తెలంగాణలో 5.50లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడుబియ్యం కొనేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని,కేసీఆర్ మాటలు విని తెలంగాణ రైతాంగం ఆగమైందని ఎద్దేవా చేశారు.తెలంగాణ పండించిన మెజారిటీ పంట సీడ్ కంపెనీ కోసం పండించింది తప్ప కేసీఆర్ కొంటాడన్న నమ్మకంతో కాదన్నారు.కేసీఆర్ అనాలోచిత ఆలోచనకారణంగా రాష్ట్రంలో కొనుగోళ్లలో ఆలస్యం అవుతుందని,అకాల వర్షాలతో కల్లాలలోనే ధాన్యం తడిసి కొట్టుకపోతుందన్నారు.చరిత్రలో రైతులను ఎవరు శాసించలేదు ఒక్క కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే చెప్పిన పంట వేయాలని రైతులను శాసించారనీ,కేంద్రం కొంటామని చెప్పిన కేసీఆర్ మాత్రం రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపి ంచారు.రాష్ట్రంలో సరైన కొనుగోళ్లు, గన్నీబ్యాగులు, ట్రాన్స్‌పోర్టు లేక రైతాంగం ఆగమై పోయిందన్నారు. మిల్లులు టోకెన్లు ఇస్తేనే కొనే దుర్భరపరిస్థితి నెలకొందన్నారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి సలిగంటి వీరేందర్, జిల్లా అధికారప్రతినిధి పల్స మల్సూర్, కౌన్సిలర్ కట్కూరి కార్తీక్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల వెంకటరెడ్డి, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు అబీద్,ఎస్సీ సెల్ వల్థాసు ఉపేందర్,మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మీర్‌అక్బర్,బోళ్ల కర్నాకర్ సైదాహుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.