Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరి రూరల్
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వీరామంగా అమలవు తున్నాయని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్స్ 2020 బ్యాచ్ బి.రాహుల్, మకరంద్ మండే, అశ్విని వాక్టే, అపూర్వ్ చౌహన్, మయంక్ మిట్టల్, ప్రతిభా సింగ్, అభిషేక్ అగస్త్య బందం కలెక్టర్‌ను కలుసుకున్నారు. డాక్టర్ మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివద్ధి ఇనిస్టిట్యూట్ లైసన్ ఆఫీసర్ సి.రాంబాబు వారి వెంట ఉన్నారు. కాన్ఫరెన్స్ హాలులో వారితో సమావేశమైన కలెక్టర్ జిల్లాలో అమలు జరుగుతున్న పలు అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో పలు అభివద్ధి కార్యక్రమాల అమలు, పచ్చదనం, పారిశుధ్యం పనులు నిర్విరామంగా జరుగుతున్నాయని తెలిపారు. కావాల్సిన మొక్కలు ఆ గ్రామాలలో ఏర్పాటు చేసిన నర్సరీల ద్వారా పెంచడం, అవెన్యూ ప్లాంటేషన్‌లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతున్నట్టు తెలిపారు. జిల్లాలోని 421 గ్రామపంచాయతీల్లో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీల ఏర్పాటు ద్వారా మొక్కల సంరక్షణకు వాటరింగ్ చేపట్టడం, ట్రాలీల ద్వారా ఇటింటి నుండి తడి, పొడి చెత్త విడివిడిగా సేకరిస్తునన తెలిపారు. మొత్తం 421 గ్రామ పంచాయతీలలో 418 వైకుంఠధామాలు, 419 సెగ్రిగేషన్ షెడ్స్, 650 పల్లె ప్రకతి వనాలను వినియోగంలోకి తెచ్చినట్టు తెలిపారు. ఉపాధి హామీ అమలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవిన్యూ ఆడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రామాణాభివద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద., ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యాంసుందర్, జిల్లా విద్యా శాఖ అధికారి నర్సింహ పాల్గొన్నారు.
విత్తన ప్యాకింగ్ కేంద్రంలో కలెక్టర్ తనిఖీ
బీబీ నగర్‌లోని రాయల్ సీడ్స్ విత్తన కంపెనీలో మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మిక తనిఖీ చేశారు. కంపెనీలో జరుగుతున్నటువంటి పత్తి విత్తనాల ప్యాకింగ్ యూనిట్ ను, విత్తనశుద్ధి కార్యక్రమాన్ని సరైన పద్ధతిలో నిర్వహిస్తున్నరా లేదా అని పరిశీలించారు. పత్తి విత్తనాలు పండించిన గ్రోవర్స్ లిస్టు పరిశీలించారు. ఎన్ని కిలోల విత్తనాలు వచ్చినవి అని చెక్ చేశారు.450 గ్రాముల బీటీ విత్తనాలకు 25 గ్రాములు నాన్ బీటీ విత్తనాలు కలపాలని సూచించారు. విత్తన పాకెట్లపై డేట్ ఆఫ్ టెస్టింగ్ తర్వాత లాట్ నెంబర్ ఎం ఆర్ పి రేట్ మొదలైనవి కరెక్టుగా ప్రింట్ చేయాలని తెలిపారు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. రికార్డులు అన్నీ ఎప్పటికప్పుడు అప్డెట్ చేసుకోవాలని తెలిపారు. అనాలసిస్ టెస్ట్ రిజిస్టర్, సీడ్ ప్రాసెసింగ్ రిజిస్ట్రర్ మొదలగునవి కరెక్ట్‌గా మెయింటెన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, సహా య వ్యవసాయ సంచాలకులు దేవ సింగ్, మండల వ్యవసాయ అధికారి పద్మ పాల్గొన్నారు.