Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీకే గడ్డిపల్లి మృత్తిక శాస్త్రవేత కిరణ్
నవతెలంగాణ-గరిడేపల్లి
రైతులు తప్పనిసరిగా భూసారపరీక్షలు చేయించు కోవాలని శ్రీ అరబిందో కషి విజ్ఞానకేంద్రం గడ్డిపల్లి మత్తిక శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు.మండలంలో పొనుగోడు గ్రామంలో మంగళవారం భూసారపరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరైతు తమనేల యొక్క భూసారాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా ఎరువులు వాడాలన్నారు.తద్వారా ఎరువుల వాడకంలో అనవసర ఖర్చులు తగ్గించి భూసారాన్ని కాపాడుకుంటూ అధిక, సుస్థిర దిగుబడులు సాధించొచ్చన్నారు.భూసార పరీక్షలు చేయడం ద్వారా పోషకాల పరిమాణం కాకుండా భూమిలోని చౌడు, సున్నంశాతాన్ని గుర్తించవచ్చుని తెలిపారు.రైతులు తమ పొలంలోని మట్టిని సేకరించి కేవీవీ గడ్డిపల్లికి పంపిస్తే రైతులకు భూసార పరీక్ష చేసి భుఆరోగ్యపత్రాలు అందజేస్తామని తెలిపారు.తర్వాత ప్రత్యక్షంగా రైతుపొలంలో మట్టినమూనాలను సేకరించే విధానాన్ని రైతులకు వివరించారు. మట్టి నమూనాలు సేకరించే విధానానికి 7893989055 నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో కేవీకే సిబ్బంది బచ్చు వెంకటేశ్వర్లు, రైతులు అలుగువేల్లి దేవిరెడ్డి, ఏడుపాల సత్య నారాయణరెడ్డి, కుక్కడప్పు నర్సింహా రావు, చింతకుంట్ల నరేష్‌రెడ్డి, ఏడుపాల గోవిందమ్మ పాల్గొన్నారు.