Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఉస్మానియా విశ్వవిద్యాలయం టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌తో మంగళవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పం దం ప్రకారం విశ్వవిద్యాలయంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా విద్యార్థులను రూపొందించడం కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం టెక్నాలజీ బిజినెస్ ఇంకుబేటర్ సంస్థతో దీనిని నిర్వహిస్తారు. కార్యక్రమంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సొల్లేటి గోపాల్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి. కృష్ణారావు, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డాక్టర్ కవిత శ్రీదేవి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె.అంజిరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రేఖ, డాక్టర్ రమేష్, ఓఎస్డీ డాక్టర్ అల్వాల రవి, ఐక్యూ ఏసీ సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధ్యాపకులు పాల్గొన్నారు.