Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి నివాళి
నవతెలంగాణ-మాడుగులపల్లి
భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సీనియర్ నాయకుడు మాడ్గులపల్లి మండలం ఇస్కబావిగూడెం గ్రామానికి చెందిన మొల్లాల నర్సిరెడ్డి (72) గత కొంత కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి తదితరులు మంగళవారం మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య, మొల్లాల కృష్ణారెడ్డి, మొల్లాల నవీన్ రెడ్డి, మొల్లాల శ్రీనివాస్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, పల్నాటి లింగారెడ్డి, పుట్ట రాజయ్య పాల్గొన్నారు.