Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నూతనకల్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కషి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్అన్నారు మంగళవారం మండల పరిధిలోని చిల్పకుంట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిం చారు.అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం బడుగు, బలహీన వర్గాలతోపాటు దళితుల అందరికీ సమాన ఓటు హక్కుతో పాటు చట్టసభల్లో కూడా అవకాశాలు లభించాయన్నారు.చిన్న రాష్ట్రాలతో అభివద్ధి సాధ్యమని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం కొన్ని దేశాలు విచ్ఛిన్నమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారతరాజ్యాంగం పటిష్టంగా ఉండడం వల్ల కొన్ని సవరణలు మాత్రమే చేస్తూ సమైక్య భారతదేశంగా భిన్నత్వంలో ఏకత్వంగా విభిన్న కులాలు, మతాలు ఐక్యపరుస్తున్న దేశంగా ఎప్పటికీ కొనసాగుతుందన్నారు.వారి ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు సమగ్రంగా అభివద్ధి చెందాయన్నారు. వ్యవసాయం గత పాలనకన్నా నాలుగురెట్లు అభివద్ధి చెంది తుంగతుర్తి నియోజకవర్గం నాడు కలలుగన్న పోరాడిన బీఎన్.రెడ్డి ఆశయం సాధ్యమై నియోజక వర్గంలో గోదావరి జలాలు పారుతున్నాయన్నారు. అనంతరం గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీరోడ్లను ప్రారంభించారు.ఈ కార్యక్ర మంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికా యుగంధర్‌రావు, వైస్‌చైర్మెన్ గోపగాని వెంకట నారాయణగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ.రజాక్, ఎంపీపీ భూరెడ్డి కళావతిసంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, టీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు మున్న మల్లయ్యయాదవ్, సర్పంచ్ కొంపెల్లి రాంరెడ్డి, మండల ప్రధానకార్యదర్శి బత్తుల సాయిల్‌గౌడ్, విద్యాసాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిక్కి బుచ్చయ్యగౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు పులుసు లింగమల్లయ్య,నాయకులు బాణాల సత్యనారాయణరెడ్డి, బత్తులవిద్యాసాగర్, విజరు కుమార్, గడ్డంయాదగిరి, రామసాని వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, రేస్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పేదింటి ఆడపిల్లలకు వరం కల్యాణలక్ష్మీ
చివ్వెంల :కల్యాణలక్ష్మీ పథకం పేదింటి ఆడపిల్లలకు వరంలాంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండలంలోని పంచాయతీ రాజ్ ద్వారా 2 కోట్లా 10 లక్షల రూపాయలతో మొగ్గయ్యగూడెం,చందుపట్లలో బీటీరోడ్డుపనులకు, అలాగే రూ.1.45 కోట్ల్ల బిడ్జి నిర్మాణపనులకు, రూ.2.16 కోట్లతో చివ్వెంల నుండి ఖాశీంపేట రోడ్డు, చివ్వెంలలో రూ.50 లక్షలతో చేపట్టే ఎస్సీ కమ్యూనిటీహాల్నిర్మాణపనులకు, లైబ్రరరీ భవనం నిర్మాణపనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.చివ్వెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం చెక్కులను అందజేశారు.మండలంలో 31 గ్రామాలకు చెందిన 214మంది లబ్దిదారులకు రూ.2.14 కోట్ల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్,ఆర్డీఓ రాజేంద్రకుమార్, తహసీల్దార్ రంగారావు,ఎంపీడీఓ లక్ష్మి, జెడ్పీటీసీ భూక్యాసంజీవ్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్‌రెడ్డి,పీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్‌రావు,జూలకంటి సుధాకర్‌రెడ్డి, రౌతు నర్సింహారావు,ఎంపీటీసీ మిర్యాల పార్వతమ్మ, గుర్రం సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.