Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే భాస్కర్రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనున్నట్టు మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండల పరిధిలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపికైన ఉట్లపల్లి, తక్కెళ్ళపహాడ్, ఆలగడప, రాయినిపాలం, అవంతిపురం, షాబూనగర్, యాద్గార్పల్లి, ఈదులగూడ, తుంగపహాడ్, జప్తివీరప్పగూడెం, బి.అన్నారం, చిల్లాపురం, గోగువారిగూడెం ప్రభుత్వ పాఠశాలల్లో రూ.కోటి 61 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంపొందించే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో ప్రణాళికలు సిద్ధం చేసి షెడ్యూల్ ప్రకారం త్వరితగతిన పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో 197 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో మొదటి విడతగా 70 పాఠశాలలను గుర్తించామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మెన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, ఎంఈఓ బాలాజీ నాయక్ పాల్గొన్నారు.