Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లో మూడో గ్రూపు ఏర్పాటయ్యింది.ఇప్పటికే ఉన్న గ్రూపులు చాలవన్నట్టుగా మూడో గ్రూపును ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్‌ల మధ్య గ్రూపు రాజకీయాలు ఉన్న సంగతి విదితమే. వీరి గ్రూపు రాజకీయాల వల్ల 2019 శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరాజయం పాలయ్యారు. గ్రూపు వివాదాలే ఇందుకు ప్రధాన కారణమని పార్టీ అధిష్టానం దష్టికి కొంతమంది నాయకులు తీసుకెళ్లారు. ఉన్న గ్రూపులు చాలవన్నట్టు ఇటీవల మూడో గ్రూపు మునుగోడులో ముందుకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మూడో గ్రూపుకు కంచర్ల కష్ణా రెడ్డి నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. కంచర్ల కష్ణా రెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రామాల్లో ఇప్పటికే అనేక సేవ, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. పలువురు పేదలకు ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. తన సొంత ఇమేజిని పెంచుకునే కార్యక్రమంలో కష్ణారెడ్డి కార్యకర్తలతో మమేకమై నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీిఆర్‌ఎస్ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌ల మధ్య ఇప్పటికే గ్రూపు విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ కు ఉన్న బలంతో పోలిస్తే కాంగ్రెస్ బలహీనపడింది. టీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. అధికార టీఆర్ఎస్లో అదే స్థారులో గ్రూపు విభేదాల, అసంతప్తి పెరిగింది. ఇతర పార్టీల నుండి వలసలు రావడంతో ప్రజాప్రతినిధుల పరంగా సంఖ్యాబలం పెరిగినప్పటికీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక అసంతప్తి వాదులందరు మూడో వ్యక్తి రాకను కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు కొట్లాడితే మూడో వ్యక్తికి అవకాశం అన్నట్లు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కర్నె ప్రభాకర్ ల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు కంచర్ల కష్ణా రెడ్డి రాకను స్వాగతిస్తున్నట్లు ప్రజలు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక సొంత గ్రూపులోనే వేరుకుంపటి పెట్టినట్టు తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా గల చౌటుప్పల్,నారాయణపురం,మునుగోడు,చండూరు, నాంపల్లి,మర్రిగూడెం మండలాల్లో కర్నె ప్రభాకర్ కు చెందిన వర్గీయులే కాకుండ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. చౌటుప్పల్ లో మున్సిపల్ చైర్మెన్ వన్ రెడ్డి రాజు,ఎంపీపీ తాండూర్ వెంకట్ రెడ్డి, మునుగోడులో ఎంపీపీ భర్త నార బోయిన రవి, చండూర్ లో కర్నాటి వెంకటేశం, నాంపల్లిలో వేనేపల్లి వెంకటేశ్వర్లు, మర్రిగూడలో ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి ఒంటి కొంతమంది ముఖ్య నాయకులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై ఇప్పటికే పలువిధాలుగా అసంతప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు నుండి పోటీ చేయడానికి తాను సిద్ధమని ఇప్పటికే కర్నె ప్రభాకర్ ప్రకటించారు. ఇన్చార్జిగా తను కొనసాగుతున్న మునుగోడు నియోజకవర్గంలో మరొకరికి ఏ విధంగా అవకాశం వస్తుందని తనకే పోటీ చేసేందుకు పూర్తి అవకాశాలున్నాయని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా కూసుకుంట్లకు అనుకూలంగా లేదని, కర్నె ప్రభాకర్,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇరువురి గ్రూపు విభేదాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన అధిష్టానం తనకే పోటీ చేసే అవకాశం ఇస్తుందని కంచర్ల కష్ణారెడ్డి ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరే కాకుండా నియోజకవర్గంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు , చలిమేడకు చెందిన వేమిరెడ్డి నరసింహారెడ్డి కోడలుకు, హైదరాబాదలో పనిచేస్తున్న ఓ జిల్లా కలెక్టర్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.