Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-కేతేపల్లి
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని, గ్రామీణ ఆర్థ్ధిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం కేతేపల్లి మండలం కొత్త పేట గ్రామంలో 20 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, గ్రామంలోని ప్రాథ మిక పాఠశాలలో మన ఊరు- మన బడి కార్యక్ర మంలో భాగంగా 17 లక్షలతో మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపన చేశారు. కాసనగోడు గ్రామాల్లో రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసి, రూ. 12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట, కాసనగోడ్ సర్పంచ్లు బచ్చు జానకి రాములు, చల్లా పూలమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెమట వెంకన్న యాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొప్పుల ప్రదీప్ రెడ్డి, బంటు మహేందర్, చల్లా కృష్ణారెడ్డి, వంటల చేతన్ కుమార్ పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కేతేపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు 40 లక్షల విలు వగల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ దేశంలో ఏ నాయకుడు చేయలేని పథకాలను కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెమట వెంకన్న యాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొప్పుల ప్రదీప్ రెడ్డి, బంటు మహేందర్, వంటల చేతన్ కుమార్, బొజ్జ అరవింద్ పాల్గొన్నారు.