Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్
నవతెలంగాణ - మోటకొండూరు
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్‌గౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ తో కలసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ధాన్యాన్ని మధ్య దళారీ దారులకు అమ్ముకొని రైతులు మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మెన్‌్ ఎగ్గిడి బాలయ్య, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొట్ల యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, పార్టీ మండల సెక్రెటరీ జనరల్ ఎర్ర మల్లేష్ యాదవ్, రైతులు పాల్గొన్నారు.