Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేవీపీఎస్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ఈదులగూడెం, ఏనె వద్ద మంగళవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ప్రజల అనేక సమస్యను వివరించారు. ఇండ్లు, స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. మిషన్ భగీరథకు సంబంధించిన పైప్లైన్ లేక మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. పరశురాములు మాట్లాడుతూ రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నారని, పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా రాలేదన్నారు. దళితులందరికీ దళిత బంధు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మంగా రెడ్డి , కేవీపీఎస్ పట్టణ నాయకులు బొల్లంపల్లి పాపారావు, పల్లెర్ల సైదులు, నరేష్, బొల్లంపల్లి ప్రశాంత్, విజయ, మహేష్, నాగరాజు, పార్వతమ్మ పాల్గొన్నారు.