Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థ లను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మం పాటి శంకర్ డిమాండ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏపీ పేపర్ లీకేజీల వ్యవహారంలో అరెస్టయిన నారాయణ సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల న్నారు. పేపర్ లీకేజీపై తెలంగాణలో కూడా దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో శ్రీచైతన్య, నారా యణ , ఇతర కార్పొరేట్ సంస్థలను రద్దు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రేణుక, సుకుమార్ పాల్గొన్నారు.
దేవరకొండ : ఏపీ పేపర్ లీకేజీల వ్యవహా రంలో అరెస్టయిన నారాయణ సంస్థల యాజమా న్యంపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానికంగా విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల యాజ మాని నారాయణ అరెస్టు అయ్యారన్నారు. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపించాలన్నారు.