Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి
నవతెలంగాణ-నల్లగొండ
రోడ్డు వెడల్పుగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి అన్నారు. గురువారం మున్సిపల్ కమిషనర్ వార్డు వాచ్ కార్యక్రమంలో భాగంగా 26వ వార్డు లో కౌన్సిలర్ ఆసిమా సుల్తానా బషీరుద్దిన్ తో కలిసి పర్యటించి వార్డు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కచెల్మ, రెహమాన్ భాగ్ ప్రాంతాల్లో రోడ్ల వెంట మట్టి దిబ్బలు లేకుండా ఎప్పడికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలు నాటాలని సిబ్బందిని ఆదేశించారు. ఓపెన్ డ్రెయినేజీకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకు కనెక్షన్ ఇస్తున్నట్లు, ఓపెన్ నాలాలకు పెన్సింగ్ వేస్తున్నట్లు తెలిపారు. పాత భవనాలను తొలగించాలని, ఇంటి పన్ను, నీటి బిల్లులను సకాలంలో చెల్లించాలని కోరారు. అనంతరం చర్లపల్లి అర్బన్ పార్కు అభివృధ్ధి పనులను, మర్రిగూడ జంక్షన్, హైదరాబాద్ రోడ్డులోని వివేకానంద విగ్రహం వద్ద జరిగే రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇంజనీర్లు నర్సింహారెడ్డి, వెంకన్న, దిలీప్, రవీందర్, నాగిరెడ్డి, శివ, పర్యావరణ ఇంజనీర్ కొమ్ము ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ మూర్తుజా, జహిరున్నిసా, భాజామియా, జిలానీ, జావీద్ పాల్గొన్నారు.