Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కార్మిక రంగంలో పని ప్రదేశాలలో జరుగుతున్న సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. గురువారం బీటీఎస్లో మున్సిపల్ హాజర్ పాయింట్ వద్ద సర్వే నిర్వహించారు. పని ప్రదేశాలలో దళితులు, గిరిజనులు, మైనారిటీలపై జరుగుతున్న వివక్షను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ సీఐటీయూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక రంగంలో సామాజిక అణచివేత రూపాలని తెలుసుకొని ఆ వర్గాలకు అండగా ఉంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పట్టణ నాయకులు సలీవొజు సైదాచారి, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పెరిక కృష్ణ, పేర్ల సంజీవ, తీగల ఎల్లమ్మ, మాచర్ల సైదులు, బొప్పని శ్రీనివాస్, రామలింగయ్య, పద్మ పాల్గొన్నారు.