Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంస్కతిక కార్యక్రమాలతో ఆటా...పాటా
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుజూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజల కొసం పని చేసేది కళ అని..ప్రజలను చైతన్య పరచి పోరాట మార్గాన్ని ఎంచుకునేలా ప్రజానాట్య మండలి కషి చేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.ప్రజా నాట్య మండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పీవీఆర్ గార్డెన్ లో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలా పాటలతో అలరించారు. ప్రజలను మేలుకొలిపే విధంగా పాటలు పాడారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. పెరిగిన పెట్రోల,్ గ్యాస,్ డీజిల్, నిత్యావసర వస్తువులు ధరలతో పేద ప్రజలు పడుతున్న బాధలు అద్దం పట్టేలా ప్రదర్శన నిర్వహించారు. మతం వద్దు, ఉపాధి కావాలి...విద్య, వైద్యం ఉచితంగా అందిం చాలని...దేశం గెలవాలని ప్రదర్శించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పౌర చట్టం, ప్రభుత్వ ఆస్తులను ఎలా అమ్ముతున్నారో వివరిం చారు. గ్యాస్ బిల్లు చూసి గుండె దమాల్ అన్నట్టు ప్రదర్శన చేశారు. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుతో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు ఆయన మాట్లాడుతూ ప్రజల చైతన్యవంతులై పోరాటలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్, కెవిపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్,మల్లు గౌతమ్ రెడ్డి, రవి నాయక్, భవాండ్ల పాండు, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, నాయకులు ఎండి.అంజాద్, వరలక్మి, పరుశురాములు, వినోద్ నాయక్, యూటీఫ్ నాయకులు నాగమణి, బక్క శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ రెడ్డి, గాదె పద్మ, పాపా నాయక్, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.