Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్ పల్లి
నార్కట్ పల్లి ఆర్టీసీ బస్ డిపో ఎత్తివేతకు నిరసనగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి పేర్కొన్నారు. గురు వారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నార్కట్ పల్లి డిపోను 1932 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండో డిపోగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎనిమిది దశాబ్దాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి జీవనోపాధిని కల్పిస్తుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిపోను ఎత్తివేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.