Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేదంతా మోసమేనని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ విమర్శించారు. గురువారం మండలంలోని మండలపురం గ్రామంలో వరంగల్ డిక్లరే షన్ను రైతులకు వివరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని సోనియా గాంధీకి మాటిచ్చి మోసం చేసారన్నారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తామని, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి రూ.20 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి యాస కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొండ శంకర్ గౌడ్, ఎంపీటీసీ ఇమ్మడిపాక లక్ష్మీ వెంకన్న, మాజీ సర్పంచ్ జిల్లా వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు బండ వెంకట్ రెడ్డి, తీగల వెంకన్న, తండు భద్రయ్య, కొత్తపల్లి నర్సింహ, తీగల నాగయ్య, గింజల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.