Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మండలంలోని పుట్టపాక గ్రామంలో గురువారం నార్కట్పల్లి కామినేని వైద్య సిబ్బంది సహకారంతో 12 ఏండ్ల లోపు వయస్సు గల చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని సర్పంచ్ సామల భాస్కర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో చిన్న పిల్లలకు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య సమస్యలు గుర్తించారు. అవసరమైనవారికి నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో లైఫ్ న్యూట్రిషన్ అడ్వైజర్ గజం పుష్పలత, టీిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చుక్క గాలయ్య, జిల్లా నాయకులు దేప విప్లవ రెడ్డి, గుజ్జ పీఏసీఎస్ చైర్మెన్ చెన్నోజు బ్రహ్మచారి, కార్యదర్శి కర్నాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చుక్క బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ చిలువేరు జంగయ్య, మండల కమిటీ సభ్యులు బొమ్మకంటి స్వామి, గ్రామ పంచాయతీ కో ఆప్షన్ సభ్యులు ఐతరాజు రాములు, గజం శ్రవణ్ కుమార్, బొల్లపల్లి వెంకటేష్, పిట్ట పెంటయ్య పాల్గొన్నారు.