Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మఠంపల్లి
దేశంలో రోజు రోజుకు నిత్యావసరాల ధరల పెరుగుదల, ఆదాయం తగ్గుదల, దాడులు, దౌర్జన్యాలు చూస్తుంటే భార తదేశం మరో శ్రీలంకగా మారే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నిత్యం గ్యాస్, పెట్రోలు, నూనెలు, కూరగాయలు వంటి అన్నిరకాల నిత్యావ సరాల ధరలు పెరిగిపోతున్నాయని, ప్రజలకొనుగోలు శక్తి పడిపో తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నియంత్రించే విష యంలో పాలక ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టడం లేద న్నారు. రైల్వే, ప్రభుత్వ రంగసంస్థలను ప్రయివేటు పరం చేయ డం, విద్యుత్, రవాణారంగాలను వదిలించుకునేందుకు సిద్ధపడుతున్నారని అన్నారు. నిరుద్యోగం పెరిగిపోయి పరిశ్ర మలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవ సాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడిందని, దాంతో రైతు ఆత్మహత్యలు అపలేకపో తున్నారన్నారు. పేదలకిచ్చే సబ్సిడీలపై కోత పెడుతున్నా రన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినే విధంగా పాలసాగు తుందన్నారు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నా యని, అవినీతికి అడ్డుకట్ట వేయలేక పోతున్నారని ఆరోపించారు. దేశంలో రూ.లక్ష 55 వేల కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు. దేశాన్ని పాలకుల నుండి కాపాడాలంటే ప్రజా పోరాటాలు విస్తృతం కావాలన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా పాండు నాయక్, మండల కార్యదర్శి మాలోత్ బాల నాయక్, శాఘం రెడ్డి జగన్ మోహన్ రెడ్డి, పల్లె వెంకటరెడ్డి, జక్కుల వెంకటేశ్వర్లు, ఎస్డీ రన్ మియా, వెంకటేశ్వర్లు, హర్యానాయక్ పాల్గొన్నారు.