Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదగిరి గుట్ట:గత 46రోజులుగా యాదగిరిగుట్ట పైకి ఆటోలను అనుమతించాలని దీక్ష చేస్తున్న ఆటో కార్మికులను ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య విమర్శించారు. గురువారం ఆయన గుట్ట లో విలేఖరులతో మాట్లడుతూ ప్రవేట్ వాహనాలను గుట్టపైకి అనుమతించకపోవడంతో,గత 30 సంవత్సరాలుగా యాదగిరిగుట్ట దేవాలయాన్ని నమ్ముకొని బతుకుతున్న 300 ఆటో కార్మికుల బతుకులు రోడ్లు పడ్డాయన్నారు.ప్రభుత్వానికి, ఆలయ అధికారులకు డబ్బే ముఖ్యం అనుకుంటున్న సందర్భంలో నెలకు 1000రూ.చెల్లించడానికి కూడా సిద్ధపడి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వగా కనీసం కలెక్టరేట్ కూడా స్పందించకపోవడం దారుణమన్నారు.తక్షణమే ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్పందించి యాదగిరిగుట్ట పైకి ఆటోలను అనుమతించాలన్నారు.ఆటో కార్మికులను ఆదుకోవాలని లేని పక్షంలో ఆటో కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉదతం చేస్తాంమని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశం లో వై జేఏసి నాయకులు గుడ్ల నరేశ్, ఆటో యూనియన్ నాయకులు గుండు నర్సింహ్మా తదితరులు పాల్గొన్నారు.