Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్వలకు ఇరువైపులా భూములను గుర్తించాలి
- నిర్లక్ష్యం చేస్తే చర్యలు
- కలెక్టర్ టి.వినరు కష్ణారెడ్డి
నవతెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్
వచ్చే హరితహారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖ పరిధిలో గల యోగ్యమైన భూములలో విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ టి.వినరు కష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీటిపారుదల శాఖ పరిధిలో గల భూములు,కాలువల విస్తీర్ణత పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు యస్. మోహన్ రావు, పాటిల్ హేమంత్ కేశవ్ లతో కలసి మాట్లాడారు. జిల్లాలో ఎన్ఎస్పిఎస్. ఆర్ఎస్పి అలాగే మూసి పరిధిలో గల భూముల హద్దులను రెవెన్యూ శాఖ సహకారంతో నిర్దేశించిన గడువు లోపు గుర్తించాలని సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలు జిల్లా పునర్విభజనకు ముందు ఉన్న కార్యాలయాలలో భూములకు సంబందించిన రికార్డ్లను రెవెన్యూ సహకారంతో పరిశీలించి పూర్తిస్థాయి నివేదికలను అందించాలని ఆదేశించారు. భూములు, కాలువలకు సంబందించిన మ్యాప్ లను సిద్ధం చేసి సత్వరమే అందించాలని, నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గుర్తించిన భూములు,అలాగే కాలువలకు ఇరువైపుల నాటిన మొక్కల సంరక్షణకు ఆయా గ్రామాలలో కూలీలను ఏర్పాటు చేసి ఇజియస్ ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందని అన్నారు. ముక్యంగా ఆక్రమణలు జరిగిన భూముల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. ముందుగా కాలువలకు ఇరువైపులలో గల కంప చెట్లను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని, వచ్చే గురువారం ఏర్పాటు చేసే సమావేశానికి పూర్తిస్థాయి నివేధికలతో హాజరు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ ముఖుంధ రెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్సీిలు సూర్యాపేటనాగేశ్వర రావు, కోదాడ నర్సింహ రావు, ఈఈలు భద్రు నాయక్,విజరు కుమార్, సత్యనారాయణ,శ్రీనివాస్, డీఈ లు, ఏఈలు, ఫీల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.