Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు అందుబాటులో వైద్య సేవలు
- సూర్యాపేటకు నర్సింగ్ కళాశాల మంజూరు
- జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికిి నూతన భవనం
- త్వరలోనే మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం
- మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ- సూర్యాపేటకలెక్టరేట్
వైద్యసేవలు అందించడంలో నర్సుల పాత్ర కీలకంగా ఉంటుందని జిల్లాకేంద్రానికి నర్సింగ్ కళాశాల మంజూరైందని ,అనువైన భవనం లభ్యమైతే ఈ సంవత్సరం నుండే నర్సింగ్ కళాశాల ప్రారంభం కానుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నర్సుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతిని వెలిగించిన అనంతరం మాట్లాడుతూ నర్సింగ్ వత్తికి మరే వత్తి సాటి రాదన్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న రోగులను రక్తసంబంధికులు సైతం దూరం పెట్టె తరుణంలో ఎన్నో సాదకబాధకాలను ఎదుర్కొని సేవలందిస్తున్న వారు నర్సులని కొనియాడారు. రోగాల బారిన పడి దుర్గంధం వస్తున్న ఖాతరు చేయకుండా అక్కున చేర్చుకున్న వారే నర్సులని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో అవార్డులు సాదించుకున్నామని గుర్తుచేశారు. వైద్యరంగంలో కీలకమైన నర్సింగ్ వత్తికి గౌరవాన్ని ,హుందాతనాన్ని తీసుకొచ్చిన ఘనత నైటింగేల్ దని చెప్పారు. అందుకే ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా నర్సుల దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నామన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో సూర్యాపేటలో మెడికల్ కళాశాల కు అనుబంధం గా మారిన జిల్లా ప్రభుత్వాస్పత్రి సేవలు పక్క జిల్లాలకే కాకుండా పక్క రాష్ట్రాలకు విస్తరించాయన్నారు. అందులో వైద్యులతో పాటు నర్సుల పాత్ర కుడా శ్లాఘనియమైనదనిఅభినందించారు. మెడికల్ కళాశాల నూతన భవనాన్నిత్వరలోనే ప్రారంభించుకోబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అంటేనే హడలిపోతున్న రోజుల నుండి వైద్యం కోసం బారులు తీరే రోజులు వచ్చాయన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మెన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, జెడ్పీటీసీ జీడీ బిక్షం, పెనపహాడ్ ఎంపీపీ నెమ్మాది బిక్షం డీఎంహెచ్ఓ కోటాచలం,ఆసుపత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్ రెడ్డి,మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.