Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చౌటుప్పల్:రైతులు ఆయిల్‌పామ్ సాగుచేయడం వల్ల అధిక లాభాలు వస్తాయని జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకష్ణారెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిగూడెంలోని శుభం ఫంక్షన్హాల్లో సింగిల్‌విండో ఛైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి అధ్యక్షతన ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రత్యేకమైన స్టాళ్లు ఏర్పాటుచేశారు. ఆయిల్‌పామ్ సీడ్స్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు. పామాయిల్ సాగు వల్ల ఎకరాకు రూ.రెండు లక్షలకు తగ్గకుండా లాభం వస్తుందని తెలిపారు. కేవలం మూడేళ్లలో కాపు వస్తుందని వివరించారు. ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ ఎకరాకు ఆయిల్‌పామ్ సాగుకు రూ.50వేల వరకు లోన్ కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఎకరాకు రూ.36వేల సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, అల్లపాటి రామచంద్రప్రసాద్, సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ సూరజ్‌కుమార్, సింగిల్‌విండో వైస్‌ఛైర్మన్ చెన్నగోని అంజయ్యగౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.