Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
పైలాన్ కాలానికి చెందిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ బత్తుల విజరు కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో స్థానికులు అంత్యక్రియలో పాల్గొన్నారు. కాగా విజరు కుమార్ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలను ఐదుగురి అమర్చి ప్రాణాలు నిలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ బెటాలియన్ తరలివచ్చి విజరుకుమార్ భౌతికకాయానికి సెల్యూట్ చేసి నివాళులు అర్పించారు.
13 కిలోమీటర్లు.. 14 నిమిషాల్లో...
మలక్‌పేట యశోద ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి మధ్య 13.46 కిలోమీటర్లు ఉంది. నగర ట్రాఫిక్ పోలీసులు 14 నిమిషాల్లో చేరుకునేలా విజరు కుమార్ అవయవాలున్న అంబులెన్స్‌కు ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.