Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తుంగతుర్తి
దళితుల సాధికారత కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో దళిత బంధు లబ్ధిదారులు ఏర్పాటుచేసిన టెంట్ హౌస్ ,ఫ్లవర్ డెకరేషన్ షాపులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ మాత్రమే దళితులంతా గౌరవంగా బతకాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి తునికి సాయిలు, గ్రంధాలయ చైర్మెన్ గోపగాని రమేష్ గౌడ్, దేవాలయ కమిటీ చైర్మెన్ ముత్యాల వెంకన్న, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.