Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులకు సూచించారు.గురువారం యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అంతర్జాతీయ నర్స్ డే సందర్భంగా రాష్ట్ర ఉత్తమ స్టాఫ్ నర్సుగా ఎన్నికైన కె.జ్యోతిని వారితో పాటు ఇతర సిబ్బందిని అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉత్తమ నాణ్యత, శాస్త్రీయ, నైతికత పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్న యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాయకల్ప అవార్డు పొందడం పట్ల వైద్య ఆరోగ్య అధికారి ఎన్.వంశీకష్ణను, ఇంజనీరింగ్, ప్యారామెడికల్, పారిశుధ్య సిబ్బందిని అభినందిస్తూ కాయకల్ప అవార్డు సర్టిఫికెట్ను అందజేశారు. ఈ సందర్భంగాకలెక్టర్ వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆరోగ్య కేంద్రాలలో ఓపీి సేవలు పెరగాలని, గ్రామాలలో ఎఎన్ఎం, ఆశా సిబ్బంది సమన్వయంతో గర్భిణులకు క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామ ఆరోగ్య పోషణ కార్యక్రమాలలో పాల్గొని అవగాహన కలిపించాలన్నారు. సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగేలా కషి చేయాలని, తల్లిబిడ్డల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మల్లికార్జునరావు, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.