Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతులు షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని (ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ) యూఎస్పీసీ రాష్ట్ర నాయకులు సీహెచ్.రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం సూర్యాపేట జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బదిలీల పదోన్నతుల షెడ్యూల్ విడుదల విడుదల చేయాలని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాను ఉద్దేశించి రాములు మాట్లాడారు.దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతుల, బదిలీలను వెంటనే చేపట్టాలని, 317 జీవో అమలు కారణంగా ఏర్పడిన సీనియారిటీ ,స్పెషల్ కేటగిరి ,భార్యాభర్తల సమస్యలపై పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నంటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.దరఖాస్తు చేసుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.ఉద్యోగులకు,కుటుంబసభ్యులకు రహిత వైద్యం అందించడానికి ఈహెచ్ఎస్ కోసం వేతనాల్లో రెండుశాతం కోత విధించడానికి వీలులేదన్నారు.హెచ్ఎస్ సక్రమ అమలుకు ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించాలని కోరారు.ప్రతినెలా మొదటి తేదీన వేతనాలు విడుదల విడుదల చేయాలని, సప్లమెంటరీ బిల్లులు జాప్యం లేకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.అనిల్ కుమార్, ముత్తయ్య,ఆర్.లింగయ్య, ఎన్.సోమయ్య,సీహెచ్ భిక్షం, బి.వెంకటేశ్వరరావు,పి.శ్రీనివాస్ రెడ్డి, రామనర్సయ్య, దశరథ రామారావు, అరుణభారతి, వీరన్న,వెంకటేశ్వర్లు, వెంకటయ్య, జాన్‌సుందర్, ఆనందభాస్కర్, సీహెచ్. వీరారెడ్డి, రవి, వెంకటేశ్వర్లు, పాపిరెడ్డి, మల్లారెడ్డి, క్రాంతికుమార్, నాగేశ్వరరావు, జానయ్య, ప్రభాకర్, సైదులు,వెంకన్న, రమేష్,వెంకటయ్య ,రామకష్ణ, సాంబయ్య, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.