Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారి హర్షిత హాస్పిటల్ బిల్లు రూ.1.07 లక్షలు మాఫీ
- మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్‌రావు
నవతెలంగాణ-కోదాడరూరల్
నెలరోజుల పాటు మత్యువుతో పోరాడిన హర్షిత(6) చిన్నారి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో బుధవారం మతి చెందింది.గత నెల 21వ తేదీన జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో మండలపరిధిలోని నల్లబండగూడెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి బోయిళ్ల శ్రీను, తల్లి నాగరాణి, అక్క ఉషశ్రీ, మతి చెందగా హర్షిత, ఐశ్వర్యాలతో తీవ్రగాయాలు కావడంతో వారిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఒకే కుటుంబంలో నలుగురు మతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్పందించిన మంత్రి హరీష్‌రావు
పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రవాస భారతీయుడు జలగం సుధీర్ అభ్యర్థనకు మంత్రి హరీష్‌రావు స్పందించి... మతి చెందిన చిన్నారి హర్షిత హాస్పిటల్ బిల్లు రూ.1.07లక్షలు మాఫీ చేయించి మానవత్వం చాటుకున్నారు.నెలరోజుల పాటు ఆమె చికిత్స అయినా పెండింగ్ బిల్లు రూ.1.07 లక్షలు చెల్లించాలని వైద్యశాల యాజమాన్యం బంధువులను కోరారు. కాగా హాస్పిటల్ పెండింగ్ బిల్లు చెల్లింపు విషయం హర్షిత బంధువులు కోదాడ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రవాస భారతీయులు జలగం సుధీర్ దష్టికి తీసుకెళ్లారు.ఆయన వెంటనే ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు.పెండింగ్ బిల్లులు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాచారంపై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించి వైద్యశాలకు బిల్లు మాఫీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు జలగం సుధీర్ తెలిపారు. మంత్రి హరీష్ రావు స్పందనపై మానవత్వం పై హర్షిత బంధువులు సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందే మూడు లక్షల రూపాయల వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించిందని తెలిపారు.