Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
క్యూబిక్ మీటర్ కొలతలను రద్దు చేసి చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చందంపేట మండలకేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో ర్యాలీ ప్రదర్శన చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్ఎంఎంఎస్ డైరెక్షన్‌ను, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ నెం. 333ను తక్షణమే రద్దు చేయాలని, క్యూబిక్ మీటర్ కొలతలను రద్దు చేసి చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకొచ్చిన మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో అమలౌతున్న సమ్మర్ అలవెన్సు ను రద్దు చేసి కూలీల పొట్ట కొట్టిందన్నారు. ఇప్పుడు పని ప్రదేశంలో ఉదయం, సాయంత్రం రెండు సార్లు పని ప్రదేశంలో కూలీల ఫోటోలు, స్మార్ట్ ఫోన్స్ ద్వారా మెట్ మస్టర్ అప్ లోడ్ చేస్తేనే వేతనాలు బ్యాంకు ఎకౌంటులలోకి వేస్తామనటం చట్టవ్యతిరేకమైన చర్య అన్నారు. స్మార్ట్ ఫోన్స్ లేని, డేటా రీ చార్జీ చేసుకోలేని, చదువు లేని రిమోట్ ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజనులను, దళితులు, ఇతర పేదలను పనికి దూరం చెయ్యడమే అవుతుందన్నారు.ఎన్ఎంఎంఎస్ అమలు చెయ్యమని కేంద్ర ప్రభుత్వంకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కూలీలు వెంకమ్మ, జబ్బు, సునీత, బి సైదమ్మ, కవిత, అనిత, ఇ గోపమ్మ, వెంకట్ చలం తదితరులు పాల్గొన్నారు.