Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
ఉపాధికూలీలకు పెండింగ్‌లో ఉన్న డబ్బులను చెల్లించాలని, కేంద్రప్రభుత్వం తెచ్చిన జీవో 333ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు.బుధవారం మండలంలోని రాఘవాపురం ఎక్స్‌రోడ్డు గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు.ఉపాధి కూలీలు 8వారాల నుంచి ఉపాధికూలీ డబ్బులు రావడంలేదని,రోజుకు కూలీ రూ.70 నుండి రూ.90 మించి రావడం లేదన్నారు.ఎండతీవ్రత అధికంగా ఉందని, టెంట్లు,మంచినీటి సౌకర్యం కల్పించడం లేదని,తట్టలు, పార పనిముట్లు అందించడం లేదని ఆయన దష్టికి తీసకొచ్చారు.ఉపాధికూలీలకు రూ.259 ఇవ్వాలని, చట్టంలో ఉన్న ఎక్కడా అమలు చేయడం లేదన్నారు.ఎండలో సైతం పనులు చేస్తున్నప్పటికీ గిట్టుబాటు కూలీ ఇవ్వడం లేదన్నారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధికూలీలకు నష్టం కలిగించే విధంగా నూతనంగా 333 జీఓను తెచ్చిందన్నారు.ఉపాధి ఫీల్డ్అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బూడిద లింగయ్య, మేట్లు బొడ్డురవి, లక్ష్మారెడ్డి, మట్టిపల్లి సైదులు, కూలీలు బత్తిని కనకయ్య,బట్టుపల్లి నాగమల్లయ్య, బొర్రోజు లింగయ్య పాల్గొన్నారు.