Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి:సమాజంలో బాధ్యతతో పనిచేసినప్పుడే మంచి గుర్తింపు వస్తుందని సీఐ రవీందర్, ఎస్సై నారాయణరెడ్డి అన్నారు.బుధవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో కొన్నేండ్లుగా నిర్వహించిన ఏఎస్ఐ హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లకు బదిలీపై వెళ్తుండగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వారికి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమై ఉంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యతతో పని చేసినప్పుడు పోలీసులకు మంచి గుర్తింపు వస్తుందన్నారు.బదిలీపై వెళ్లిన వారిలో ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉన్నారు.